Heir Of Ratan Tata Is Noel Tata: టాటా ట్రస్ట్స్‌స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా (Noel Tata) నియమితులయ్యారు. రతన్ టాటా మరణానంతరం ఈ బాధ్యతను నోయల్ టాటాకు అప్పగించారు. 1991లో రతన్ టాటాకు టాటా గ్రూప్ బాధ్యతలు అప్పగించారు. అప్పుడే ఆయన టాటా ట్రస్ట్స్‌స్‌ ఛైర్మన్ పదవి చేపట్టారు. 86 ఏళ్ల వయసున్న రతన్‌ టాటా, తన మరణించే వరకు ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. రతన్‌ టాటా రెండు రోజుల క్రితం, అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 10న, ముంబైలో, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దేశ, విదేశీ ప్రజలు, ప్రముఖల అశ్రునయాల మధ్య ఆయన శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. 


రతన్‌ టాటా మరణం తర్వాత, దాతృత్వ & వ్యాపార వ్యవహారాల పగ్గాలు చేపట్టే వారసుడిని నియమించడానికి టాటా న్యాసా (టాటా ట్రస్ట్స్‌స్‌) ఈ రోజు (11 అక్టోబర్‌ 2024) సమావేశమైంది. టాటా ట్రస్ట్స్‌స్‌ తదుపరి ఛైర్మన్‌ నియామకంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. గత 40 సంవత్సరాలుగా టాటా గ్రూప్‌తో అనుబంధం ఉన్న రతన్ టాటా సవతి సోదరుడు (Half Brother) నోయల్ టాటాకు టాటా ట్రస్ట్స్‌స్‌ బాధ్యతలు అప్పగిస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.


మరో ఆసక్తికర కథనం: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్‌ ప్రారంభం - బ్రహ్మాండమైన ఫీచర్లు, ఆఫర్లు 


ఇప్పటికే టాటా ట్రస్ట్స్‌‌తో అనుబంధం
టాటా ట్రస్ట్స్‌లో, ఇప్పటికే, నోయెల్ టాటా చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం, టాటా ట్రస్ట్స్‌ పరిధిలోకి వచ్చే సర్ రతన్ టాటా ట్రస్ట్స్‌, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్స్‌‌లకు ఆయన ట్రస్టీగా ఉన్నారు. ఈ ట్రస్టులు టాటా గ్రూప్ దాతృత్వ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. టాటా గ్రూప్ మాతృ సంస్థ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది.  


నోయెల్ టాటా హయాంలో గ్రూప్ కంపెనీల ముందడుగు
నోయెల్ టాటా చాలా టాటా గ్రూప్ కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా ఉన్నారు. టాటా గ్రూప్‌లోని రిటైల్ కంపెనీ ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా & టాటా స్టీల్, టైటన్‌లకు వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ట్రెంట్ హయాంలో సాధించిన విజయాలు సర్వత్రా ప్రశంసలు అందుకున్నాయి. ట్రెంట్ మార్కెట్ క్యాప్ రూ.2.93 లక్షల కోట్లకు చేరుకుంది. నోయెల్ టాటా ఆగస్టు 2010 నుంచి నవంబర్ 2021 వరకు టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో కంపెనీ టర్నోవర్ 500 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 


మరో ఆసక్తికర కథనం: ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి ఎంత డబ్బు తీసుకోవచ్చు? - విత్‌డ్రా ప్రాసెస్‌ ఇదిగో