Jio Financial Services News: రిలయన్స్ (Reliance Industries) గ్రూప్‌లోని ఆర్థిక సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL), కొత్తగా జియో ఫైనాన్స్ యాప్‌ను (JioFinance App) మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ (google play store), యాపిల్ యాప్ స్టోర్ (apple app store) లేదా మైజియో (MyJio) నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రారంభం సందర్భంగా, ఆకర్షణీయమైన ఆఫర్‌లతో జియో పైనాన్స్‌ యాప్‌ వినియోగదార్ల ముందుకు వచ్చింది. 


కంపెనీ కొత్త & మెరుగైన జియోఫైనాన్స్ యాప్‌ను ప్రారంభించినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ రోజు ‍‌(శుక్రవారం, 11 అక్టోబర్‌ 2024) రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ విషయాన్ని తెలియజేసింది. 


60 లక్షల మంది నుంచి ఫీడ్‌బ్యాక్‌
వాస్తవానికి, జియో పైనాన్స్‌ యాప్‌ బీటా వెర్షన్ (ప్రయోగాత్మక వెర్షన్‌) ఈ ఏడాది మే 30న ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న వాళ్లకు ఈ యాప్‌ వినియోగానికి కంపెనీ అనుమతి ఇచ్చింది. దాదాపు 60 లక్షల మంది (6 మిలియన్ల మంది) జియో ఫైనాన్ యాప్‌ బీటా వెర్షన్‌ను వినియోగించారు. ఆరు మిలియన్‌ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తర్వాత, ఈ న్యూ-ఏజ్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ను (యాప్‌) మరింత మెరుగుపరిచినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకటించింది.


జియో ఫైనాన్స్‌ యాప్‌ విశేషాలు
బీటా వెర్షన్‌ను తీసుకొచ్చిన కంపెనీ... మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ‍‌(Loan against Mutual Funds), నగదు బదిలీ (Balance transfer), గృహ రుణం (Home loan), ఆస్తులపై రుణం (Loan against assets) సహా వివిధ రకాల ఆర్థిక ఉత్పత్తులు & సేవలను జియో ఫైనాన్స్‌ యాప్‌నకు జోడించింది. ఈ రుణాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని, కస్టమర్లకు భారీ మొత్తంలో డబ్బు సేవ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. 


సేవింగ్స్‌ చేసే వాళ్లు జియో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్‌లో కేవలం 5 నిమిషాల్లో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‌ను తెరవవచ్చని కంపెనీ ప్రకటించింది. బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫిజికల్ డెబిట్ కార్డ్‌ ద్వారా సురక్షితమైన బ్యాంక్ ఖాతాలను ఈ కంపెనీ అందిస్తోంది. జియో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్‌లో 1.5 మిలియన్ల మంది (15 లక్షల మంది) వినియోగదార్లు రోజువారీ & పునరావృత లావాదేవీలు చేస్తున్నారు. ఈ అకౌంట్‌ను ఉపయోగించి UPI పేమెంట్‌, మొబైల్ రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు వంటివి కూడా చేయొచ్చు.


జియో ఫైనాన్స్‌ యాప్‌లో, యూజర్లు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులతో పాటు వివిధ బ్యాంకుల్లోని తమ హోల్డింగ్స్‌ను కూడా చూడొచ్చు. తద్వారా, తమ ఆర్థిక వ్యవహారాలను మెరుగైన రీతిలో నిర్వహించుకునేందుకు వీలవుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ కంపెనీ జీవిత బీమా (Life insurance), ఆరోగ్య బీమా ‍‌(Health insurance), ద్విచక్ర వాహన బీమా (Two wheeler insurance), మోటారు వాహన బీమాను (Motor vehicle insurance) డిజిటల్‌గా అందిస్తోంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ బ్లాక్‌రాక్‌తో కలిసి జియో ఫైనాన్షియల్ పని చేస్తోంది.


మరో ఆసక్తికర కథనం: అంబానీని మించి సంపాదించిన అదానీ - నంబర్‌ 1 ఎవరో తెలుసా?