Ratan Tata Salary: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా భారతీయ పారిశ్రామికరంగంలోనే కాకుండా ప్రపంచంలోనే టాప్ వైవిధ్యమైన బిజినెస్‌మ్యాన్‌గా పేరుపొందారు. వ్యాపారాలను లాభదాయకంగా నడిపించడంలోనే కాకుండా దాతృత్వంలో కూడా తనకు సాటి ఎవరూ లేరని రుజువు చేశారు. అందుకే ఆయన ప్రజల పారిశ్రామికవేత్తంగా వెలుగొందారు.

  
రతన్‌ టాటా వ్యాపార చతురతతో టాటా గ్రూప్‌ వందకుపైగా దేశాల్లో 30కిపైగా కంపెనీలు విస్తరించి ఉన్నాయి. వాటి విలువ 403 బిలియన్ డాలర్లు అంటే 33.7 ట్రిలియన్ రూపాయల కంటే ఎక్కువ అన్నమాట. టాటా స్టీల్‌ ప్లాంట్‌లోని కొలిమి వద్ద ప్రారంభమైన రతన్ టాటా ఉద్యోగ జీవితంలో అనేక పాత్రలు పోషించారు. రతన్ టాటా 1991-2012 వరకు టాటా గ్రూప్ ,టాటా సన్స్ ఛైర్మన్‌గా పనిచేశారు. అక్టోబర్ 2016 - జనవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఎమిరిటస్ ఛైర్మన్ కొనసాగుతున్నారు. 


టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా జీతం ఎంత? 
టాటా గ్రూప్, టాటా సన్స్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో రతన్ టాటా వార్షిక వేతనం రూ. 2.5 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ. 20.83 లక్షలు సంపాదించారు. రోజుకు రూ.70,000, గంటకు రూ.2,900 లేదా నిమిషానికి దాదాపు 49 రూపాయలు అందుకున్నారు, ప్రస్తుతం టాప్ పారిశ్రామికవేత్తలుగా ఉన్న వారి జీతంతో పోలిస్తే చాలా తక్కువ.  


ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ముఖేష్ అంబానీ నిమిషానికి రూ. 3.09 లక్షలు సంపాదిస్తారు. అంటే సెకనుకు దాదాపు 51,250 రూపాయలు అన్నమాట. రతన్ టాటా ఒక రోజులో సంపాదించిన దానికంటే ఎక్కువ.



రతన్ టాటా జీతం ఎందుకు తక్కువగా ఉంది?
రతన్ టాటా ప్రపంచంలోని టాప్ కంపెనీగా ఉన్న టాటా గ్రూప్‌నకు లీడర్ అయినప్పటికీ జీతం మాత్రం చాలా తక్కువ తీసుకున్నారు. ఆయన తీసుకున్న జీతం ఇప్పుడున్న కార్పొరేట్ ఉద్యోగితో సమానమైన జీతం. దేశంలో అత్యంత బిలియనీర్‌లలో ఒకరైనప్పటికీ ఆయనకు సమాజం పట్ల, ప్రజలక పట్ల, మూగజీవాల పట్ల ఉన్న మక్కువ కారణంగా తక్కువ జీతంతో లైఫ్‌ను లీడ్ చేశారని సన్నిహితులు చెబుతారు. 


బాగా డబ్బులు సంపాదించి పేరు ప్రఖ్యాతులు పొందాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ లేదంటారు సన్నిహితులు. తన సంపాదనలో ఎక్కువ జంతువుల, స్వచ్ఛంద సంస్థల కోసం వైద్యం, విద్య, పరిశోధన రంగాలపై ఖర్చు పెట్టేవారు. అందుకే తన సంపాదన కంటే వాటిపై ఎక్కువ ఖర్చు పెట్టడంతో ఆయన జీతం తక్కువగా ఉంది. 


రతన్ టాటా జీతంతోపాటు, పెట్టుబడులు, షేర్లు సహా అనేక ఇతర వనరుల నుంచి అదనపు ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ దాదాపు 3,800 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇన్ని కోట్లు ఉన్నప్పటికీ ఆయన మనసు ఎప్పుడూ సామాన్యుల వైపు ఉండేది. ప్రజలకు, మూగజీవాలకు సేవ చేసేందుకు ఆసక్తి చూపే వాళ్లు. సింపుల్ లైఫ్‌ను లీడ్ చేసేవాళ్లు. 


Also Read: 29 ఏళ్ల యువకుడే రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్‌ అండ్‌ మేనేజర్- గుడ్‌ బై లైట్‌హౌస్‌ అంటూ వీడ్కోలు