WhiteOak Capital Mutual Fund: మీరు మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో (SIP) పెట్టుబడి పెడుతుంటే, ఒక అలవాటును మాత్రం సీరియస్‌గా వదిలించుకోవాలని వైట్‌వోక్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (WhiteOak Capital Mutual Fund) సూచించింది. ఒకవేళ అదే హాబిట్‌ కంటిన్యూ చేస్తే మాత్రం మీ లాభాలను చేతులారా చెడగొట్టుకున్నట్లేనని హెచ్చరించింది. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం తర్వాత, వైట్‌ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ఈ విషయాలను వెల్లడించింది.


19 సంవత్సరాల SIP రిటర్న్‌ల పోలిక
FY 2005-06 నుంచి FY 2023-24 వరకు, 19 సంవత్సరాల కాలంలో SIPల రాబడులను వైట్‌వోక్‌ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ పోల్చి చూసింది. దీర్ఘకాలం పాటు ఒకే ఇండెక్స్‌లో పెట్టుబడిని కొనసాగించిన ఇన్వెస్టర్లు, లేదా, ఏటా అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఇండెక్స్‌కు సిప్‌ను మార్చిన ఇన్వెస్టర్ల కేసులను పరిశీలించింది. ఈ రెండు సందర్భాల్లో పెట్టుబడిదార్లు ఎంత రాబడి పొందారో అధ్యయనం చేసింది. గత 19 ఏళ్లలో (01 ఏప్రిల్ 2024 వరకు), స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ & మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లో చేసిన SIPలు లార్జ్ క్యాప్ ఇండెక్స్ కంటే మెరుగైన లాభాలు ఇచ్చాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. 


అయితే, ఈ 19 సంవత్సరాల కాలంలో... లార్జ్‌ క్యాప్ SIPలు ఓవరాల్‌ SIPల కంటే ఏడు రెట్లు పెరిగితే, స్మాల్‌ క్యాప్ & మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ SIPలు ఓవరాల్‌ SIPలను ఆరు రెట్లు అధిగమించాయి.


స్థిరత్వంతో అధిక రాబడి
FY 2005-06 నుంచి, దీర్ఘకాలం పాటు మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ సూచీల్లో పెట్టుబడులు కొనసాగించడం - గత సంవత్సరంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సూచీలకు మారడం.. ఈ రెండు సందర్భాల్లోనూ ఇన్వెస్టర్లు అధిక రాబడి పొందినట్లు వైట్‌వోక్‌ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. అయితే... ఏటా అత్యుత్తమ ఇండెక్స్‌కు మారే బదులు, మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లోనే పెట్టుబడి కొనసాగించిన ఇన్వెస్టర్లు 01 ఏప్రిల్ 2024 వరకు 18.8% వార్షిక రాబడి పొందారని తెలిపింది. ఇండెక్స్‌ను ఏటా మార్చిన కేసులో కేవలం 15.5% రాబడి మాత్రమే సంపాదించగలిగారట. అదే విధంగా.. స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌లోనే SIPని కంటిన్యూ చేసినవాళ్లు 16% వార్షిక రాబడి పొందారు. ఇండెక్స్‌ను ఏటా మార్చినవాళ్లు 15.1% మాత్రమే దక్కించుకున్నారు.


గత 10 సంవత్సరాల రోలింగ్ సిప్‌ రిటర్న్‌లను పరిశీలిస్తే... మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లో SIP కంటిన్యూ చేసినవాళ్లకు 16.6% వార్షిక రాబడి దక్కింది. మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లో ప్రారంభమై, ఏటా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఇండెక్స్‌కు మారిన వాళ్లకు 14.5% మాత్రమే రాబడి వచ్చింది. అదే కాలంలో, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌లో సిప్‌ స్టార్ట్‌ చేసి కంటిన్యూ చేసినవాళ్ల సగటు రాబడి 14%గా ఉంది. ఉత్తమ పనితీరు గల సూచికకు మారడం వల్ల 13.9% రాబడి వచ్చిందని వైట్‌వోక్‌ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఫామ్‌-16లో ఏం ఉంటుంది, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఈ డాక్యుమెంట్‌ ఎందుకు కీలకం?