By: ABP Desam | Updated at : 05 May 2023 10:34 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Opening 05 May 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. నిన్నటి లాభాల జోరును కొనసాగించలేకపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ 4 శాతం నష్టపోవడం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 55 పాయింట్లు తగ్గి 18,200 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 202 పాయింట్లు తగ్గి 61,547 వద్ద చలిస్తున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,749 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,163 వద్ద మొదలైంది. 61,163 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,570 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 202 పాయింట్ల నష్టంతో 61,547 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,255 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,117 వద్ద ఓపెనైంది. 18,104 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,205 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 55 పాయింట్లు తగ్గి 18,200 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,110 వద్ద మొదలైంది. 43,035 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,559 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 132 పాయింట్లు తగ్గి 43,552 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఎల్‌టీ, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. హెచ్డీఎఫ్‌పీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ సూచీలు ఎగిశాయి. బ్యాంక్, ఫైనాన్స్, మీడియా, మెటల్, ప్రైవేటు బ్యాంక్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.62,400గా ఉంది. కిలో వెండి రూ.1150 పెరిగి రూ.78,250 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.27,440 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Watch the video to know how Demat Debit and Pledge Instruction (DDPI) significantly mitigates the misuse of Power of Attorney (PoA)!#NSE #NSEIndia #DDPI #POA #InvestorAwareness #StockMarket #ShareMarket @ashishchauhan pic.twitter.com/3wuF7bhq8X
— NSE India (@NSEIndia) May 5, 2023
On this auspicious occasion of Buddha Purnima, let us remember the teachings of Lord Buddha and strive towards a peaceful and harmonious world. Happy Buddha Purnima #NSE #NSEIndia #BuddhaPurnima @ashishchauhan pic.twitter.com/ALg4wuyFl9
— NSE India (@NSEIndia) May 5, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?