Stock Market Opening Bell 08 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్స్‌ లాభాల్లో ఉండటంతో మదుపర్లు ఇక్కడ కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 108 పాయింట్ల లాభంతో 17,733 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 409 పాయింట్ల లాభంతో 59,438 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 59,028 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,374 లాభాల్లో మొదలైంది. 59,374 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,638 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 409 పాయింట్ల లాభంతో 59,438 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 17,624 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,748 వద్ద ఓపెనైంది. 17,722 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,792 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 108 పాయింట్ల లాభంతో 17,733 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 39,763 వద్ద మొదలైంది. 39,706 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,763 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 477 పాయింట్ల లాభంతో  39,933 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. శ్రీ సెమ్‌, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ లైఫ్‌, బ్రిటానియా, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మీడియా, మెటల్‌, ఫార్మా, రియాల్టీ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్‌, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.