Stock Market Opening Bell 21 July 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ఓపెనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 41 పాయింట్ల లాభంతో 16,562, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 127 పాయింట్ల లాభంతో 55,523 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 55,397 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,391 వద్ద మొదలైంది. 55,270 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,591 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం పదిన్నర గంటలకు 127 పాయింట్ల లాభంతో 55,523 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 16,520 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,523 వద్ద ఓపెనైంది. 16,483 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,578 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 41 పాయింట్ల లాభంతో 16,562 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 36,026 వద్ద మొదలైంది. 35,887 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,152 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 120 పాయింట్ల లాభంతో 36,091 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో, ఎల్‌టీ, యూపీఎల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. కొటక్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కన్జూమర్ డ్యురబుల్స్ మినహా మిగతా రంగాల సూచీలన్నీ లాభపడ్డాయి. రియాల్టీ, మెటల్, మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు గిరాకీ ఉంది