Stock Market @12 Pm on 15 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం రేంజ్‌ బౌండ్‌లో కదలాడుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా వెంటాడుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సెంటిమెంటు కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్ల లాభంతో 15,767, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 122 పాయింట్ల లాభంతో 52,816 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్‌ షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది.


BSE Sensex


క్రితం సెషన్లో 52,693  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,650 వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైంది. 52,538 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,819 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 122 పాయింట్ల లాభంతో 52,816 వద్ద కదలాడుతోంది.


NSE Nifty


మంగళవారం 15,732 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,729 వద్ద ఓపెనైంది. 15,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,780 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 35 పాయింట్ల లాభంతో 15,767 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరు లాభాల్లో ఉంది. ఉదయం 33,317 వద్ద మొదలైంది. 33,249 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,507 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 180 పాయింట్ల లాభంతో 33,491 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరోమోటోకార్ప్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, కోల్‌ ఇండియా, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ గ్రీన్‌లోనే ఉన్నాయి. కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఫార్మా, బ్యాంకు, ఆటో షేర్లకు గిరాకీ ఉంది.