search
×

Stock Market Closing: బ్యాంకు షేర్లు భళా! యాక్సిస్‌ అదుర్స్‌ - హైలోనే ముగిసిన మార్కెట్లు

Stock Market Closing 21 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్పంగా లాభపడ్డాయి. మార్కెట్లు ఉదయం నుంచీ ఒడుదొడుకుల్లోనే సాగాయి. బ్యాంకింగ్‌ షేర్లు విపరీతంగా లాభపడ్డాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 21 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్పంగా లాభపడ్డాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అందాయి. మార్కెట్లు ఉదయం నుంచీ ఒడుదొడుకుల్లోనే సాగాయి. బ్యాంకింగ్‌ షేర్లు విపరీతంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 12 పాయింట్ల లాభంతో 17,576 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 104 పాయింట్ల లాభంతో 59,307 వద్ద ముగిశాయి. రూపాయి 26 పైసలు బలపడి 82.75 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 82.68 వద్ద ముగిసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 59,202 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,381 వద్ద లాభాల్లో మొదలైంది. 59,132 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,590 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 104 పాయింట్ల లాభంతో 59,307 వద్ద ముగిసింది.

NSE Nifty

బుధవారం 17,563 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,622 వద్ద ఓపెనైంది. 17,520 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,670 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 12 పాయింట్ల లాభంతో 17,576 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీగా లాభపడింది. ఉదయం 40,370 వద్ద మొదలైంది. 40,355 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,370 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 684 పాయింట్ల లాభంతో 40,784 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, దివిస్‌ ల్యాబ్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్పంగా పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, రియాల్టీ సూచీలు ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 21 Oct 2022 03:56 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

టాప్ స్టోరీస్

IML Tourney Winner India Masters: ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు

IML Tourney Winner India Masters: ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు

Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి

Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి

Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి

AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం

AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం