Stock Market Closing Bell 12 August 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలే అందాయి. వారాంతం కావడంతో సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. నష్టాల్లో ఓపెనైనా క్రమంగా లాభాల్లోకి వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 39 పాయింట్ల లాభంతో 17,698 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 130 పాయింట్ల లాభంతో 59,462 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలపడి 79.77 వద్ద క్లోజైంది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,332 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,235 వద్ద మొదలైంది. 59,113 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,538 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 130 పాయింట్ల లాభంతో 59,462 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,659 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,659 వద్ద ఓపెనైంది. 17,597 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,724 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 39 పాయింట్ల లాభంతో 17,698 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 38,942 వద్ద మొదలైంది. 38,739 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,088 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 162 పాయింట్ల లాభంతో 39,042 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, యూపీఎల్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫీ, మారుతీ, టాటా కన్జూమర్స్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.