Stock Market Closing Bell 7 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఓపెనవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడం,  ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలు, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 149 పాయింట్ల లాభంతో 16,139, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 427 పాయింట్ల లాభంతో 54,178 వద్ద ముగిశాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 53,750 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,146 వద్ద లాభాల్లో మొదలైంది. 53,927 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,254 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి  427 పాయింట్ల లాభంతో 54,178 వద్ద ముగిసింది.  


NSE Nifty


బుధవారం 15,989 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,113 వద్ద ఓపెనైంది. 16,045 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,150 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 149 పాయింట్ల లాభంతో 16,139 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,627 వద్ద మొదలైంది. 34,553 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,627 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 596 పాయింట్ల లాభంతో 34,920 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, టైటాన్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే ఇండియా, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్‌, హిందుస్తాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. రియాల్టీ, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.