Stock Market Opening 07 September 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. రూపాయి మరోసారి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరడంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 64 పాయింట్ల నష్టంతో 17,267 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 197 పాయింట్ల నష్టంతో 58,025 వద్ద ఉన్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 58,222 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,092 వద్ద నష్టాల్లో మొదలైంది. 57,911 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,231 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 197 పాయింట్ల నష్టంతో 58,025 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,331 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,287 వద్ద ఓపెనైంది. 17,239 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,334 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 64 పాయింట్ల నష్టంతో 17,267 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 39,093 వద్ద మొదలైంది. 38,827 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,134 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 318 పాయింట్ల నష్టంతో 38,964 వద్ద ఉంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ఉన్నాయి. టైటాన్, బజాజ్ ఆటో, హీరో మోటో, మారుతీ, యూపీఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సెమ్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒకట్నినర శాతం వరకు నష్టపోయాయి. కన్జూమర్ డ్యురబుల్స్ 1.28 శాతం లాభపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.