By: ABP Desam | Updated at : 02 Sep 2022 04:04 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Closing Bell 02 September 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం భారీగా అమ్మకాలు చేపట్టిన మదుపర్లు సాయంత్రానికి కొనుగోళ్లకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 3 పాయింట్ల నష్టంతో 17,538 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 36 పాయింట్ల లాభంతో 58,803 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 25 పైసలు తగ్గి 79.80 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,766 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,969 వద్ద నష్టాల్లో మొదలైంది. 58,558 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,108 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. తీవ్ర ఒడుదొడుకులకు లోనై చివరికి 36 పాయింట్ల లాభంతో 58,803 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,542 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,598 వద్ద ఓపెనైంది. 17,476 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,643 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 3 పాయింట్ల నష్టంతో 17,538 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మోస్తరు లాభాల్లో ముగిసింది. ఉదయం 39,422 వద్ద మొదలైంది. 39,200 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,595 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 119 పాయింట్ల లాభంతో 39,421 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌టీ, కొటక్ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్, శ్రీసెమ్, హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్సియల్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్ రంగాల సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!