Stock Market Closing Bell 06 September 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. దాంతో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. సూచీలు ఆద్యంత ఊగిసలాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 10 పాయింట్ల నష్టంతో 17,655 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 48 పాయింట్ల నష్టంతో 59,196 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 25 పైసలు తగ్గి 79.80 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,245 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,285 స్వల్ప లాభాల్లో మొదలైంది. 58,974 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. తీవ్ర ఒడుదొడుకులకు లోనై చివరికి 48 పాయింట్ల నష్టంతో 59,196 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,665 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,665 వద్ద ఓపెనైంది. 17,587 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 10 పాయింట్ల నష్టంతో 17,655 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,892 వద్ద మొదలైంది. 39,564 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,073 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 134 పాయింట్ల లాభంతో 39,671 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ముగిశాయి. అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, శ్రీసెమ్ షేర్లు లాభపడ్డాయి. టాటా కన్జూమర్, బజాజ్ ఫిన్‌సర్వ్, బ్రిటానియా, హిందుస్థాన్ యునీలివర్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి. బ్యాంక్, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.