By: Rama Krishna Paladi | Updated at : 02 Aug 2023 12:51 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market 02 August 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం విలవిల్లాడుతున్నాయి. ఫిచ్ రేటింగ్స్ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను AAA నుంచి AA+కు తగ్గించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. రాబోయే మూడేళ్లలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని అంచనా వేసింది. ఫలితంగా అమెరికా బాండ్ యీల్డులు మరింత పెరిగాయి. అలాగే డాలర్ ఇండెక్స్ 102కు చేరుకుంది. ఫలితంగా ఆసియా, అంతర్జాతీయ సూచీలు క్రాష్ అయ్యాయి. ఈ ప్రభావం భారత మార్కెట్ల పైనా పడింది.
మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 189 పాయింట్లు తగ్గి 19,543 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 642 పాయింట్లు తగ్గి 65,816 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,459 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,064 వద్ద మొదలైంది. 65,751 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,261 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 642 పాయింట్ల నష్టంతో 65,816 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,733 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,655 వద్ద ఓపెనైంది. 19,517 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,678 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 189 పాయింట్లు తగ్గి 19,543 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 45,234 వద్ద మొదలైంది. 44,985 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,404 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 499 పాయింట్లు తగ్గి 45,093 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, దివిస్ ల్యాబ్, హిందుస్థాన్ యునీలివర్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, హీరో మోటో కార్ప్, కోల్ ఇండియా, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.77300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.560 తగ్గి రూ.24,550 వద్ద కొనసాగుతోంది.
Also Read: జనం బంగారం కొనడం మానుకుంటున్నారు, రీజన్ ఇదే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Deal only with registered stockbrokers and transfer funds only to their registered client bank accounts! To know more: https://t.co/jnYKAwNOYO#NSE #NSEIndia #InvestorAwareness #ClientBankAccounts @ashishchauhan
— NSE India (@NSEIndia) August 2, 2023
Don't fall for schemes or messages that claim to give you assured/guaranteed returns in stock market! Please report at Feedbk_invg@nse.co.in or call us at 1800 266 0050 whenever you come across such messages.#NSE #NSEIndia #investorprotection #investorawareness @ashishchauhan pic.twitter.com/1VoF87xvpD
— NSE India (@NSEIndia) August 1, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) August 1, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/EafJ5ZWmAN
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?