Stock Market Opening Bell 09 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఉన్నాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారిన్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుండటంతో స్థానిక మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 93 పాయింట్ల లాభంతో 17,892 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 265 పాయింట్ల లాభంతో 59,932 వద్ద ట్రేడవుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 59,688 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,045  వద్ద లాభాల్లో మొదలైంది. 59,899 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,119 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 265 పాయింట్ల లాభంతో 59,932 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 17,798 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,923 వద్ద ఓపెనైంది. 17,868 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 93 పాయింట్ల లాభంతో 17,892 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ఉంది.  ఉదయం 40,520 వద్ద మొదలైంది. 40,450 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,685 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 370 పాయింట్ల లాభంతో 40,579 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. శ్రీ సెమ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌టీ, పవర్‌ గ్రిడ్‌, బీపీసీఎల్‌ నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.