Stock Market Opening Bell 22 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఓపెనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే వచ్చినప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్ల లాభంతో 16,635 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 100 పాయింట్ల లాభంతో 55,785 వద్ద కొనసాగుతున్నాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 55,681 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,800 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 55,724 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,006 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటల సమయంలో 100 పాయింట్ల లాభంతో 55,785 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty


గురువారం 16,605 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,661 వద్ద ఓపెనైంది. 16,623 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,704 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో 16,635 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 36,322 వద్ద మొదలైంది. 36,286 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,534 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 279 పాయింట్ల లాభంతో 36,480 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. యూపీఎల్‌, ఐచర్‌ మోటార్స్‌, టైటాన్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌, టాటా కన్జూమర్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఆటో, మీడియా, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాల సూచీలు ఎగిశాయి. మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.