Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా ఐదో సెషన్లో భారీ నష్టపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు, ఎకానమీ స్లోడౌన్‌, ఇన్‌ప్లేషన్‌ డేటా రావడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం ఇందుకు కారణం. ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,808 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1158 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.5.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.   


BSE Sensex


క్రితం సెషన్లో 54,088 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,608 వద్ద నష్టాల్లో మొదలైంది. 53,632 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఉదయం నుంచే అమ్మకాలు పెరగడంతో  52,702 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1158 పాయింట్ల నష్టంతో 52,930 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 16,167 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,021 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే పతనమైంది. 16,041 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 15,735 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 359 పాయింట్ల నష్టంతో 15,808 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 34,289 వద్ద మొదలైంది. 33,297 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,341 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1161 పాయింట్ల నష్టంతో 33,532 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ఉన్నాయి. విప్రో, ఐచర్‌ మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. అదానీపోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టపోయాయి. క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, బ్యాంక్‌, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ సూచీలు 1-4 శాతం వరకు పతనం అయ్యాయి.