Stock Market Closing 13 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌, అమెరికాలో మాంద్యం, ఐరోపా మార్కెట్ల వంటివి మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 109 పాయింట్ల నష్టంతో 17,014 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 390 పాయింట్ల నష్టంతో 57,235 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలహీనపడి నేడు 82.35 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,625 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,512 వద్ద నష్టాల్లో మొదలైంది. 57,055 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,568 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 390 పాయింట్ల నష్టంతో 57,235 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 17,123 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,087 వద్ద ఓపెనైంది. 16,956 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,112 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తానికి 109 పాయింట్ల నష్టంతో 17,014 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీగా నష్టపోయింది. ఉదయం 38,957 వద్ద మొదలైంది. 38,437 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,061 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 494 పాయింట్ల నష్టంతో 38,624 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. విప్రో, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీల ఒక శాతం మేర పతనమయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.