By: ABP Desam | Updated at : 22 Sep 2022 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 22 September 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు పెంచడంతో బెంచ్‌మార్క్ సూచీలు నష్టపోయాయి. ముందుగానే ఇందుకు సిద్ధమవ్వడంతో భారీగా పతనమవ్వ లేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 88 పాయింట్ల నష్టంతో 17,629 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 337 పాయింట్ల నష్టంతో 59,119 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 80.86 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,456 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,073 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 58,832 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,457 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 337 పాయింట్ల నష్టంతో 59,119 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 17,718 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,609 వద్ద ఓపెనైంది. 17,532 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,722 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 88 పాయింట్ల నష్టంతో 17,629 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ నష్టాల్లో క్లోజైంది. ఉదయం 40,889 వద్ద మొదలైంది. 40,360 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,159 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 572 పాయింట్ల నష్టంతో 40,530 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ముగిశాయి. టైటాన్, హిందుస్తాన్ యునీలివర్, ఏసియన్ పెయింట్స్, మారుతీ, ఐచర్ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
IML Tourney Winner India Masters: ఫైనల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భారత్ దే.. ఆరు వికెట్లతో విండీస్ చిత్తు
Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం