search
×

Stock Market Closing: 18,150 టచ్‌ చేసిన నిఫ్టీ, 61,121 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్‌ - బ్యాంకు షేర్ల వణుకు!

Stock Market Closing 01 November 2022: నవంబర్‌ నెల మొదటి రోజు స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 01 November 2022: నవంబర్‌ నెల మొదటి రోజు స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 133 పాయింట్ల లాభంతో 18,145 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 374 పాయింట్ల లాభంతో 61,121 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 82.70 వద్ద స్థిరపడింది. 

BSE Sensex

క్రితం సెషన్లో 60,746 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,065 వద్ద మొదలైంది. 60,868 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,289 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 374 పాయింట్ల లాభంతో 61,121 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 18,012 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,151 వద్ద ఓపెనైంది. 18,060 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,175 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 133 పాయింట్ల లాభంతో 18,145 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 41,552 వద్ద మొదలైంది. 41,188 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,677 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 18 పాయింట్ల నష్టంతో 41,289 వద్ద  స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, దివిస్‌ ల్యాబ్‌, ఎన్టీపీసీ, గ్రాసిమ్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, ఐచర్‌ మోటార్స్‌, మారుతీ, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, మీడియా సూచీ పతనమయ్యాయి. ఐటీ, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఒక శాతం కన్నా ఎక్కువే ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 01 Nov 2022 03:51 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?

Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?

Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?

KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!

Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!