Stock Market Closing 13 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎఫ్‌ఐఐలు అమ్మకాలు చేపట్టినా మదుపర్లు విశ్వాసంతో కొనుగోళ్లు చేపట్టారు. దాంతో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కోలుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 76 పాయింట్లు పెరిగి 20,070 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 245 పాయింట్లు పెరిగి 67,466 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలహీనపడి 82.99 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సూచీలకు అండగా నిలిచాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 67,221 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 67,188 వద్ద మొదలైంది. 67,053 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,565 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 245 పాయింట్ల లాభంతో 67,466 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,993 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,989 వద్ద ఓపెనైంది. 19,944 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,096 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 76 పాయింట్లు పెరిగి 20,070 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 45,449 వద్ద మొదలైంది. 45,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,990 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 398 పాయింట్ల లాభంతో 45,909 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా (3.21%), గ్రాసిమ్ (3.13%), టాటా మోటార్స్ (2.92%), భారతీ ఎయిర్ టెల్ (2.76%), టైటాన్ (2.36%) షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీ (1.09%), అదానీ పోర్ట్స్ (1.33%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (1.47%), ఎల్‌టీ (1.09%), సిప్లా (1.04%) నష్టపోయాయి. ఆటో, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.340 తగ్గి రూ.59,450 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.230 పెరిగి రూ.24,060 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడ్డారు. చివరికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 3 పాయింట్లు తగ్గి 19,993 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 94 పాయింట్లు తగ్గి 67,221 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లు జోరుమీదున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.