Stock Market Closing, 15 September 2023:


భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం రికార్డు లాభాల్లో ముగిశాయి. చైనా మార్కెట్లు నష్టపోయినా.. మదుపర్లు సానుకూలంగానే ఉన్నారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు తగ్గడంతో అమెరికా సూచీలు పెరగడం శుభసూచకం. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 89 పాయింట్లు పెరిగి 20,192 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 319 పాయింట్లు పెరిగి 67,838 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలహీనపడి 83.18 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 67,519 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,659 వద్ద మొదలైంది. 67,614 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,927 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 319 పాయింట్ల లాభంతో 67,838 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 20,103 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 20,156 వద్ద ఓపెనైంది. 20,129 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,222 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 89 పాయింట్లు పెరిగి 20,192 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 46,122 వద్ద మొదలైంది. 46,028 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,310 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 230 పాయింట్ల లాభంతో 46,231 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఆటో (6.29%), హీరోమోటో (2.25%), ఎం అండ్‌ ఎం (2.17%), గ్రాసిమ్‌ (1.99%), హెచ్‌సీఎల్‌ టెక్‌ (1.60%) షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌ (1.60%), ఏసియన్‌ పెయింట్స్‌ (1.24%), హిందుస్థాన్‌ యునీలివర్‌ (1.27%), టాటా కన్జూమర్‌ (0.92%), బ్రిటానియా (0.97%) షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.410 పెరిగి రూ.24,410 వద్ద ఉంది.


క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?


భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఒడుదొడుకులు ఎదురైనా రికార్డు గరిష్ఠాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 33 పాయింట్లు పెరిగి 20,103 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 52 పాయింట్లు పెరిగి 67,518 వద్ద క్లోజయ్యాయి. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి సూచీలకు మద్దతు లభించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 83.04 వద్ద స్థిరపడింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.