Stock Market Opening 6 July 2023:


స్టాక్‌ మార్కెట్లు గురువారం  పాజిటివ్‌గా మొదలయ్యాయి. బెంచ్‌ మార్క్‌ సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 55 పాయింట్లు పెరిగి 19,453 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 153 పాయింట్లు పెరిగి 65,599 వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు డిమాండ్ పెరిగింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,446 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,391 వద్ద మొదలైంది. 65,328 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,656 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 153 పాయింట్ల లాభంతో 65,599 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 19,405 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,385 వద్ద ఓపెనైంది. 19,373 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,464 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 55 పాయింట్ల లాభంతో 19,453 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ఉదయం 45,060 వద్ద మొదలైంది. 45,042 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,220 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం ఒక పాయింటు పెరిగి 45,151 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, బ్రిటానియా, పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి. ఐచర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, దివిస్‌ ల్యాబ్‌, బజాజ్ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌ షేర్లు తగ్గాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ సూచీలు ఎరుపెక్కాయి. మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు కళకళలాడుతున్నాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,160గా ఉంది. కిలో వెండి రూ.800 పెరిగి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.24,230 వద్ద ఉంది. 


Also Read: ఈఎంఐ భారం పెంచనున్న టమాట! ఆర్బీఐపై 'కూరగాయాల' ప్రెజర్‌!!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial