Stock Market Opening 31 January 2023:
స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. అస్థిరత నెలకొనడంతో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 64 పాయింట్ల నష్టంతో 17,586 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 246 పాయింట్ల నష్టంతో 59,254 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు షేర్లకు డిమాండ్ పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్లు.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,500 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,770 వద్ద మొదలైంది. 59,104 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,787 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 246 పాయింట్ల నష్టంతో 59,254 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,648 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,731 వద్ద ఓపెనైంది. 17,537 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,735 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 64 పాయింట్ల నష్టంతో 17,586 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 40,563 వద్ద మొదలైంది. 40,167 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,620 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 5 పాయింట్లు పెరిగి 40,393 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.