Stock Market Opening 30 August 2023:


స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. చైనా ఉద్దీపన పథకం ప్రకటించడం మదుపర్లలో విశ్వాసం నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 101 పాయింట్లు పెరిగి 19,444 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 366 పాయింట్లు పెరిగి 65,442 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు కళకళలాడుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,075 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,311 వద్ద మొదలైంది. 65,288 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,311 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 366 పాయింట్ల లాభంతో 65,442 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 19,342 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,433 వద్ద ఓపెనైంది. 19,407 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,445 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 101 పాయింట్లు ఎగిసి 19,444 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 44,706 వద్ద మొదలైంది. 44,636 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 195 పాయింట్ల లాభంతో 44,691 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌, అపోలో హాస్పిటల్స్‌, బ్రిటానియా, ఏసియన్‌ పెయింట్స్‌ నష్టపోయాయి. నేడు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ఎన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.25,870 వద్ద ఉంది.


Also Read: ఈ రాఖీ పండుగ రోజున మీ సోదరికి ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి, ఈ 5 ఆప్షన్స్‌ బాగుంటాయి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.