Stock Market Opening 29 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. క్రూడాయిల్ ధర తగ్గినా మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటు లేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 108 పాయింట్ల నష్టంతో 18,014 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 348 పాయింట్ల నష్టంతో 60,569 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ విల్మార్, యెస్ బ్యాంకు షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,910 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,628 వద్ద మొదలైంది. 60,479 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,685 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 348 పాయింట్ల నష్టంతో 60,562 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 18,122 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,045 వద్ద ఓపెనైంది. 17,992 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,061 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 108 పాయింట్ల నష్టంతో 18,014 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 42,684 వద్ద మొదలైంది. 42,489 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,711 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 289 పాయింట్లు తగ్గి 42,538 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 4 కంపెనీలు లాభాల్లో 46 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సెమ్, టాటా మోటార్స్, గ్రాసిమ్, హిందుస్థాన్ యునీలివర్ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.