Stock Market Opening 23 February 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. నిన్నటి నష్టాల నుంచి కాస్త తేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 43 పాయింట్లు పెరిగి 17,597 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 142 పాయింట్ల పెరిగి 59,887 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,744 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,777 వద్ద మొదలైంది. 59,406 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,863 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 142 పాయింట్ల లాభంతో 59,887 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,554 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,574 వద్ద ఓపెనైంది. 17,455 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,597 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 43 పాయింట్లు పెరిగి 17,597 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 39,983 వద్ద మొదలైంది. 39,600 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,052 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 52 పాయింట్లు పెరిగి 40,048 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్ షేర్లు నష్టపోయాయి. ఫైనాన్స్, మీడియా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మెటల్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో ఎక్కువ మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,730గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.68,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.470 పెరిగి రూ.25,080 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.