Stock Market Opening 22 June 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్లు పెరిగి 18,855 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 42 పాయింట్లు తగ్గి 63,478 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ షేర్ల పతనం కంటిన్యూ అవుతోంది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 63,523 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 63,601 వద్ద మొదలైంది. 63,372 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,601 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 42 పాయింట్ల నష్టంతో 63,478 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,856 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,853 వద్ద ఓపెనైంది. 18,856 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,886 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 పాయింట్ల నష్టంతో 18,855 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,874 వద్ద మొదలైంది. 43,774 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,990 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 67 పాయింట్లు ఎగిసి 43,927 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ఉన్నాయి. ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్, దివిస్ ల్యాబ్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, మెటల్ సూచీలు ఎక్కువ ఎగిశాయి. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.59,450గా ఉంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.72,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 తగ్గి రూ.24,900 వద్ద ఉంది.
Also Read: మెడ్‌ప్లస్ బ్రాండ్ మందులు, అతి భారీ డిస్కౌంట్స్ - త్వరలో విడుదల!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial