Stock Market Opening 22 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఎరుపెక్కాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అదానీ కంపెనీల షేర్ల పతనం మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటు పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 158 పాయింట్లు తగ్గి 17,668 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 501 పాయింట్ల తగ్గి 60,170 వద్ద కొనసాగుతున్నాయి. వెండి, ప్లాటినం స్వల్పంగా పెరిగాయి. బ్యాంకు షేర్లను తెగనమ్ముతున్నారు. గంటలోనే మదుపర్లు రూ.2.5 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,672 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,391 వద్ద మొదలైంది. 60,167 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,462 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 501 పాయింట్ల నష్టంతో 60,170 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 17,826 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,755 వద్ద ఓపెనైంది. 17,664 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,772 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 158 పాయింట్లు తగ్గి 17,668 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ భారీ నష్టాల్లో ఉంది. ఉదయం 40,494 వద్ద మొదలైంది. 40,317 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,529 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 339 పాయింట్లు తగ్గి 40,333 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 8 కంపెనీలు లాభాల్లో 41 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఆటో, సన్‌ ఫార్మా, బ్రిటానియా, దివిస్‌ ల్యాబ్‌, టాటా కన్జూమర్‌ షేర్లు ఎగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ పతనం అయ్యాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరల్లో ఎక్కువ మార్పులేదు.  24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,730గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.68,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.470 పెరిగి రూ.25,080 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.