By: ABP Desam | Updated at : 17 Nov 2022 10:11 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Opening 17 November 2022: స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ఓపెనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి. దాదాపుగా అన్ని రంగాల షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి. బ్లాక్‌డీల్ జరగడంతో పేటీఎం షేర్లు కుదేలయ్యాయి. 10 శాతం పతనమై రూ.54 నష్టంతో 546 వద్ద కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 6 పాయింట్ల నష్టంతో 18,404 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 37 పాయింట్ల లాభంతో 61,027 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 61,980 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,812 వద్ద మొదలైంది. 61,768 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,018 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 37 పాయింట్ల లాభంతో 61,027 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 18,409 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,358 వద్ద ఓపెనైంది. 18,351 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,404 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 6 పాయింట్ల నష్టంతో 18,404 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్‌గా ఉంది. ఉదయం 42,399 వద్ద మొదలైంది. 42,366 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,554 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 9 పాయింట్ల నష్టంతో 42,525 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, సిప్లా, హిందుస్థాన్ యునీలివర్, టాటా కన్జూమర్, హీరోమోటో కార్ప్ షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, హిందాల్కో, టైటాన్, టాటాస్టీల్, గ్రాసిమ్ షేర్లు నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
West Godavari Viral News: పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన