Stock Market Opening 12 May 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్లు తగ్గి 18,210 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 268 పాయింట్లు తగ్గి 61,635 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,904 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,857 వద్ద మొదలైంది. 61,578 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,858 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 268 పాయింట్ల నష్టంతో 61,635 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,297 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,273 వద్ద ఓపెనైంది. 18,195 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,277 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆరంభంలో 86 పాయింట్లు తగ్గి 18,210 వద్ద నడుస్తోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,447 వద్ద మొదలైంది. 43,347 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,528 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 56 పాయింట్లు నష్టపోయి 43,418 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ఉన్నాయి. ఐచర్ మోటార్స్, హీరోమోటో కార్ప్, సిప్లా, ఎం అండ్ ఎం, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ స్వల్పంగా ఎగిశాయి. ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.62,130గా ఉంది. కిలో వెండి రూ.2600 తగ్గి రూ.75,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.28,590 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.