Stock Market Opening 10 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. గురువారం పతనమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నేడు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 29 పాయింట్ల నష్టంతో 17,863 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 108 పాయింట్ల నష్టంతో 60,698 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,806 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,706 వద్ద మొదలైంది. 60,501 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,774 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 108 పాయింట్ల నష్టంతో 60,698 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 17,893 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,847 వద్ద ఓపెనైంది. 17,801 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,871 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 29 పాయింట్ల నష్టంతో 17,863 వద్ద చలిస్తోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 41,452 వద్ద మొదలైంది. 41,424 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,678 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 93 పాయింట్లు పెరిగి 41,647 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, యూపీఎల్‌, హెచ్డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


విలువైన లోహాల ధరల్లో ఎక్కువ మార్పేమీ లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.160 పెరిగి రూ.57,500గా ఉంది. కిలో వెండి రూ.50 తగ్గి రూ.71,350 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.25,880 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.