Stock Market Opening 06 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 67 పాయింట్ల నష్టంతో 17,994 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 204 పాయింట్ల నష్టంతో 60,148 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,353 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,388 వద్ద మొదలైంది. 60,100 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,537 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 204 పాయింట్ల నష్టంతో 60,148 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,992 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,008 వద్ద ఓపెనైంది. 17,920 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,047 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 67 పాయింట్ల నష్టంతో 17,994 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 42,649 వద్ద మొదలైంది. 42,237 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,685 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 345 పాయింట్లు తగ్గి 42,263 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ సూచీలు ఎక్కువ నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.