Stock Market Opening 05 April 2023: 


స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటన నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 88 పాయింట్లు పెరిగి 17,486 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 350 పాయింట్లు పెరిగి 59,454 వద్ద కొనసాగుతున్నాయి. 


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 59,106  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,094 వద్ద మొదలైంది. 59,094 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,562 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 350 పాయింట్ల లాభంతో 59,454 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 17,398 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,422 వద్ద ఓపెనైంది. 17,402 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,514 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 88 పాయింట్లు పెరిగి 17,486 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 40,972 వద్ద మొదలైంది. 40,802 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,989 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 21 పాయింట్లు పెరిగి 40,834 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐచర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీస షేర్లు నష్టపోయాయి. ఆటో, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. 


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1030 పెరిగి రూ.61,360 గా ఉంది. కిలో వెండి రూ.2490 పెరిగి రూ.77,090 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి రూ.26,970 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.