By: ABP Desam | Updated at : 02 Nov 2022 10:44 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Twitter )
Stock Market Opening 02 November 2022: స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు గిరాకీ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్ల నష్టంతో 18,110 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 94 పాయింట్ల నష్టంతో 61,026 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి నేడు బలపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 61,121 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,156 వద్ద మొదలైంది. 60,965 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,209 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 94 పాయింట్ల నష్టంతో 61,026 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 18,145 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,177 వద్ద ఓపెనైంది. 18,101 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,178 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 35 పాయింట్ల నష్టంతో 18,110 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 41,472 వద్ద మొదలైంది. 41,232 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,472 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 89 పాయింట్ల లాభంతో 41,379 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐచర్ మోటార్స్, మారుతీ, టైటాన్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్పంగా పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
Yellamma : 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
IPL 2025 KKR VS RCB Match Abondoned: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు రద్దు ముప్పు..! ఆ కారాణాలతో జరిగే అవకాశాలు లేవు..!! ఆందోళనలో కేకేఆర్, ఆర్సీబీ
GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం