Stock Market Opening 02 June 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు లైఫ్ టైమ్ హై తాకే ముందు కన్సాలిడేట్ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 27 పాయింట్లు పెరిగి 18,515 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 70 పాయింట్లు ఎగిసి 62,498 వద్ద కొనసాగుతున్నాయి. హీరోమోటో కార్ప్ షేర్లు దూసుకెళ్తున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,428 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,601 వద్ద మొదలైంది. 62,379 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,719 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 70 పాయింట్ల లాభంతో 62,498 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,478 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,550 వద్ద ఓపెనైంది. 18,478 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,573 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 27 పాయింట్లు పెరిగి 18,515 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 43,997 వద్ద మొదలైంది. 43,812 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,040 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 128 పాయింట్లు ఎగిసి 43,919 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటో, హిందాల్కో, టైటాన్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టీసీఎస్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎక్కువ ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.340 పెరిగి రూ.61,100గా ఉంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.78,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.26,620 వద్ద ఉంది.
Also Read: బ్లూ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, రెడ్ సిలిండర్ రేటు యథాతథం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది