Stock market news: ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు - మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal), సీఎల్‌ఎస్‌ఏ (CLSA), ప్రభుదాస్ లీలాధర్ (Prabhudas Lilladher), నోమురా (Nomura) తాము ట్రాక్ చేస్తున్న స్టాక్స్ నుంచి తలా ఒక పేరును 'బయ్' రికమెండేషన్ కోసం ఇచ్చాయి. స్వల్పకాలంలో (short-term), సంబంధింత కౌంటర్లలో లాభం కళ్లజూడవచ్చని ఆయా రీసెర్చ్ హౌస్‌లు చెబుతున్నాయి. ఈ స్టాక్ రికమెండేషన్లు పూర్తిగా ఆయా బ్రోకింగ్ హౌస్‌ల అభిప్రాయాలుగా ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.
జెన్సార్ టెక్నాలజీస్ (Zensar Technologies)
బ్రోకింగ్ హౌస్ పేరు : మోతీలాల్ ఓస్వాల్
బ్రోకరేజ్ సూచించి టార్గెట్ ధర : రూ. 265
గురువారం నాటి ముగింపు ధర : రూ. 229
ఇంకా వృద్ధి చెందగల అవకాశం : 15.7 శాతం
ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో ఈ షేరు ధర రూ. 230.55 వద్ద ఉంది. ఆ సమయానికి రూ. 1.85 లేదా 0.81 శాతం పెరిగింది.
భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel)
బ్రోకింగ్ హౌస్ పేరు : సీఎల్‌ఎస్‌ఏ
బ్రోకరేజ్ సూచించి టార్గెట్ ధర : రూ. 30
గురువారం నాటి ముగింపు ధర : రూ. 784
ఇంకా వృద్ధి చెందగల అవకాశం : 18.6 శాతం
ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో షేరు ఈ ధర రూ. 779.50 వద్ద ఉంది. ఆ సమయానికి రూ. 5.60 లేదా 0.71 శాతం తగ్గింది.
రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా (Restaurant Brands Asia)
బ్రోకింగ్ హౌస్ పేరు : ప్రభుదాస్ లీలాధర్
బ్రోకరేజ్ సూచించి టార్గెట్ ధర : రూ. 156
గురువారం నాటి ముగింపు ధర : రూ. 127
ఇంకా వృద్ధి చెందగల అవకాశం : 22.8 శాతం
ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో ఈ షేరు ధర రూ.124.70 వద్ద ఉంది. ఆ సమయానికి రూ. 2.10 లేదా 1.66 శాతం తగ్గింది.
కేఈసీ ఇంటర్నేషనల్ (KEC International)
బ్రోకింగ్ హౌస్ పేరు : నోమురా
బ్రోకరేజ్ సూచించి టార్గెట్ ధర : రూ. 566
గురువారం నాటి ముగింపు ధర : రూ. 450.95
ఇంకా వృద్ధి చెందగల అవకాశం : 25.5 శాతం
ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో ఈ షేరు ధర రూ. 439.45 వద్ద ఉంది. ఆ సమయానికి రూ. 11.30 లేదా 2.51 శాతం తగ్గింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.