Stock Market Closing Bell on 10 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం రక్తమోడాయి! అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు రావడం, అంతర్జాతీయం సానుకూల సంకేతాలు లేకపోవడంతో సూచీలు విలవిల్లాడాయి. ఉదయం నుంచే మదుపర్లు షేర్లను తెగనమ్మారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 276 పాయింట్ల నష్టంతో 16,201, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1016 పాయింట్ల నష్టంతో 54,303 వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.


BSE Sensex


క్రితం సెషన్లో 55,320 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,760 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 54,205 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,780 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. పది గంటలకే 700 పాయింట్ల నష్టంలో ఉంది. చివరికి 1016 పాయింట్ల నష్టంతో 54,303 వద్ద ముగిసింది. 


NSE Nifty


గురువారం 16,478 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,283 వద్ద ఓపెనైంది. 16,172 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,324 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 276 పాయింట్ల నష్టంతో 16,201 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ బాగా నష్టపోయింది. ఉదయం 34,686 వద్ద మొదలైంది. 34,346 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,752 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 601 పాయింట్ల నష్టంతో 34,483 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ముగిశాయి. గ్రాసిమ్‌, అపోలో హాస్పిటల్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, రిలయన్స్‌ నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియాల్టీ, ప్రైవేట్‌ బ్యాంక్‌, మెటల్‌, మీడియా, ఐటీ, బ్యాంక్‌ సూచీలు 1-2 శాతం వరకు ఎరుపెక్కాయి.