By: ABP Desam | Updated at : 31 Jan 2023 03:58 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 31 January 2023:
స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడుదొడుకుల్లో చలించిన సూచీలు చివరికి నష్టాలను పూడ్చుకున్నాయి. ఎకనామిక్ సర్వే తర్వాత మదుపర్లలో సానుకూల సెంటిమెంటు పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌ఈవో పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడం వంటివి ఇందుకు దోహదం చేశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 13 పాయింట్ల లాభంతో 17,662 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 49 పాయింట్ల లాభంతో 59,549 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 42 పైసలు బలహీనపడి 81.92 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,500 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,770 వద్ద మొదలైంది. 59,104 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,787 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 49 పాయింట్ల లాభంతో 59,549 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,648 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,731 వద్ద ఓపెనైంది. 17,537 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,735 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 13 పాయింట్ల లాభంతో 17,662 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా లాభపడింది. ఉదయం 40,563 వద్ద మొదలైంది. 40,167 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 267 పాయింట్లు పెరిగి 40,655 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Market Update for the day.
— NSE India (@NSEIndia) January 31, 2023
See more> https://t.co/HtB6OkuTV1https://t.co/wbkzx6sGRA#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/btUreOugiR
Have you tried the NSE goBID app? A lot can be done online through this app.
— NSE India (@NSEIndia) January 31, 2023
Download the app now:
Android - https://t.co/sYjukn6TQM
IOS - https://t.co/7XfaySWvLn#GovernmentSecurities #NSEgoBID #GSec #NSE #goBID #StockMarket #ShareMarket @AshishChauhan pic.twitter.com/KhvrqdWPvu
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!