Stock Market Closing 29 March 2023: 


స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 129 పాయింట్లు పెరిగి 17,080 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 346 పాయింట్లు పెరిగి 57,960 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలహీనపడి రూ.82.35 వద్ద స్థిరపడింది. అదానీ గ్రూప్‌ షేర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 57,613 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,572 వద్ద మొదలైంది. 57,524 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,124 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 346 పాయింట్ల లాభంతో 57,960 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 16,951 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,977 వద్ద ఓపెనైంది. 16,940 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,126 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 129 పాయింట్లు పెరిగి 17,080 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 39,611 వద్ద మొదలైంది. 39,609 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,055 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 342 పాయింట్లు పెరిగి 39,910 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 45 కంపెనీలు లాభాల్లో 5 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, హీరోమోటో కార్ప్‌, ఐచర్‌ మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, రిలయన్స్, సిప్లా షేర్లు నష్టపోయాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎక్కువ ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,670 గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.370 తగ్గి రూ.25,350 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.