Stock Market Closing 28 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు అందాయి. జీడీపీ గణాంకాలు విడుదల అవుతుండటంతో మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఉదయం నుంచీ సూచీలు ఊగిసలాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 88 పాయింట్లు తగ్గి 17,303 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 326 పాయింట్లు తగ్గి 58,926 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 82.66 వద్ద స్థిరపడింది. నేడు అదానీ గ్రూప్‌ షేర్లు పుంజుకున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 59,288 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,346 వద్ద మొదలైంది. 58,795 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,483 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 326 పాయింట్ల నష్టంతో 58,926 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 17,392 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,383 వద్ద ఓపెనైంది. 17,255 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,440 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 88 పాయింట్లు తగ్గి 17,303 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 40,302 వద్ద మొదలైంది. 40,073 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,391 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 38 పాయింట్లు తగ్గి 40,269 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి. సిప్లా, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఐటీ, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పతనమయ్యాయి. 


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.56,120గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.840 పెరిగి రూ.25,010 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.