Stock Market Closing 28 April 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం దూసుకుపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఈ నెల ప్రథమార్ధంలో వొలటైల్‌గా కదిలిన సూచీలు కొనుగోళ్ల మద్దతుతో ద్వితీయార్ధంలో అదరగొట్టాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 149 పాయింట్లు పెరిగి 18,065 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 463 పాయింట్లు పెరిగి 60,112 వద్ద ముగిశాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో షేర్లు దుమ్మురేపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.7 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,649 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,721 వద్ద మొదలైంది. 60,507 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,209 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 463 పాయింట్ల లాభంతో 60,112 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,915 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,950 వద్ద ఓపెనైంది. 17,885 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,089 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 149 పాయింట్లు పెరిగి 18,065 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,045 వద్ద మొదలైంది. 42,810 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,302 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 233 పాయింట్లు పెరిగి 43,233 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా, విప్రో, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సిప్లా షేర్లు నష్టపోయాయి. కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.60,820గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.76,200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.360 తగ్గి రూ.28,370 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.