Stock Market Closing 27 March 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. గ్లోబల్ బ్యాంకింగ్ క్రైసిస్ నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 40 పాయింట్లు పెరిగి 16,985 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 126 పాయింట్లు పెరిగి 57,653 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి రూ.82.37 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 57,527 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,566 వద్ద మొదలైంది. 57,415 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,019 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 126 పాయింట్ల లాభంతో 57,653 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 16,945 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 16,984 వద్ద ఓపెనైంది. 16,918 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,091 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 40 పాయింట్లు పెరిగి 16,985 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 39,484 వద్ద మొదలైంది. 39,273 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 35 పాయింట్లు పెరిగి 39,431 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ఉన్నాయి. గ్రాసిమ్, రిలయన్స్, సిప్లా, దివిస్ ల్యాబ్, మారుతీ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎం అండ్ ఎం షేర్లు నష్టపోయాయి. ఆటో, ఫైనాన్స్, మీడియా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.59,730 గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.73,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.26,740 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.