Stock Market Closing, 25 May 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం నుంచి ఒడుదొడుకులకు లోనైన సూచీలు ఆఖరికి పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్లు పెరిగి 18,268 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 98 పాయింట్లు తగ్గి 61,872 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.74 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,773 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,706 వద్ద మొదలైంది. 61,484 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,934 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 98 పాయింట్ల లాభంతో 61,872 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,285 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,268 వద్ద ఓపెనైంది. 18,202 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,338 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 35 పాయింట్లు పెరిగి 18,321 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా లాభపడింది. ఉదయం 43,630 వద్ద మొదలైంది. 43,390 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,719 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 3 పాయింట్లు పెరిగి 43,681 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, ఐటీసీ, దివిస్ ల్యాబ్ షేర్లు లాభపడ్డాయి. విప్రో, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యూపీఎల్, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. ఫైనాన్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.60,870గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.73,050 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.740 తగ్గి రూ.27,220 వద్ద కొనసాగుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.