Stock Market Closing 25 January 2023:


భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. మదుపర్లు అన్ని రంగాల షేర్లనూ తెగనమ్మారు. అమెరికా, ఐరోపాలో మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఉద్యోగాల్లో కోతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 226 పాయింట్ల నష్టంతో 17,891 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 773 పాయింట్ల నష్టంతో 60,205 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్‌ సూచీలు తల్లడిల్లాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 81.59 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,978 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,834 వద్ద మొదలైంది. 60,081 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,899 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 773 పాయింట్ల నష్టంతో 60,205 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 18,188 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,093 వద్ద ఓపెనైంది. 17,846 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,100 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 226 పాయింట్ల నష్టంతో 17,891 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ భారీగా నష్టపోయింది. ఉదయం 42,703 వద్ద మొదలైంది. 41,540 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,733 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 1085 పాయింట్లు తగ్గి 41,647 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ముగిశాయి. మారుతీ, హిందాల్కో, బజాజ్‌ ఆటో, బ్రిటానియా, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1.5 నుంచి 3 శాతం వరకు పతనమయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.