By: ABP Desam | Updated at : 22 Dec 2022 03:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 22 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. కొవిడ్ భయంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 71 పాయింట్ల నష్టంతో 18,127 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 241 పాయింట్ల నష్టంతో 60,826 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 82.76 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 61,067 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,257 వద్ద మొదలైంది. 60,637 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,464 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 241 పాయింట్ల నష్టంతో 60,826 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 18,199 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,288 వద్ద ఓపెనైంది. 18,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,318 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 71 పాయింట్ల నష్టంతో 18,127 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మోస్తరు నష్టాల్లో ముగిసింది. ఉదయం 42,868 వద్ద మొదలైంది. 42,231 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,933 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 209 పాయింట్లు పతనమై 42,408 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 9 కంపెనీలు లాభాల్లో 41 నష్టాల్లో క్లోజయ్యాయి. సన్‌ఫార్మా, ఎస్‌బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సెమ్, గ్రాసిమ్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్ఆయంక్, రియాల్టీ సూచీలు ఒక శాతం కన్నా ఎక్కువే ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Maharashtra New Government: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్