Stock Market Closing 17 February 2023:
మూడు రోజుల లాభాలకు తెరపడింది. స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 91 పాయింట్లు తగ్గి 17,944 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 316 పాయింట్ల నష్టంతో 61,002 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలహీనపడి 82.83 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,319 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,993 వద్ద మొదలైంది. 60,810 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,302 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 316 పాయింట్ల నష్టంతో 61,002 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,035 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,974 వద్ద ఓపెనైంది. 17,884 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,034 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 91 పాయింట్లు తగ్గి 17,944 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 41,514 వద్ద మొదలైంది. 40,882 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,516 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 499 పాయింట్లు తగ్గి 41,131 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టపోయాయి. అల్ట్రాటెక్ సెమ్, ఏసియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఎల్‌టీ, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ లైఫ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.220 తగ్గి రూ.56,510గా ఉంది. కిలో వెండి రూ.400 తగ్గి రూ.68,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.40 తగ్గి రూ.24,450 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.