Stock Market Closing 16 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అందడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 61 పాయింట్ల నష్టంతో 17,894 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 168 పాయింట్ల నష్టంతో 60,092 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 28 పైసలు బలహీనపడి 81.66 వద్ద స్థిరపడింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు షేర్ల ర్యాలీ కొనసాగింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,261 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,550 వద్ద మొదలైంది. 59,963 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,586 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 168 పాయింట్ల నష్టంతో 60,092 వద్ద ముగిసింది.
NSE Nifty
శుక్రవారం 17,856 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,033 వద్ద ఓపెనైంది. 17,853 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,049 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 61 పాయింట్ల నష్టంతో 17,894 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 42,622 వద్ద మొదలైంది. 42,066 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,715 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 203 పాయింట్లు తగ్గి 42,167 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫీ, విప్రో, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.