Stock Market Closing 16 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. కంపెనీలు మెరుగైన ఫలితాలు ప్రకటించడంతో ఐటీ సూచీ ఎక్కువ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 20 పాయింట్లు పెరిగి 18,035 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 44 పాయింట్ల లాభంతో 61,319 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక్కరోజునే 151 పైసలు బలపడి 82.71 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,275 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,566 వద్ద మొదలైంది. 61,196 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,682 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 44 పాయింట్ల లాభంతో 61,319 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 18,015 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,094 వద్ద ఓపెనైంది. 18,000 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,134 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 20 పాయింట్ల లాభంతో 18,035 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 41,925 వద్ద మొదలైంది. 41,521 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,979 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 99 పాయింట్లు తగ్గి 41,631 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 24 నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌, దివిస్‌ ల్యాబ్‌, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, ఐచర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ,  మీడియా, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.430 తగ్గి రూ.56,730గా ఉంది. కిలో వెండి రూ.950 తగ్గి రూ.69,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.230 తగ్గి రూ.24,490 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.